Wednesday, June 11, 2014

.....................పెళ్ళీ..................



హడావిడి అయిపోయింది. అప్పుడే అర్ధమైంధి "లేట్" అయ్యాను అని, ఏదో ఫోన్ లో చెపితే; పోదాం అనుకోని మరిచిపోయా , ఆఫీసు నుండి తిరిగి వస్తుంటే “తన కాల్”... ఎక్కడున్నారు?, మీ కోసం అందరం ఇక్కడ వెయిటింగ్ అని , ఏమాటకు ఆ మాటే చెప్పుకోయాలి తను 2 రోజుల ముందునుంచి గుర్తుచేస్తూనే ఉంది,  ముందు మీరు వెళ్ళండి తరువాత వీలైతే వస్తా అన్నా! తన ఫ్రెండ్ పెళ్లి కదా, తనకి ఉన్న ఇంట్రస్ట్ నాకెందుకు ఉంటుంది వచ్చాక తప్పదు అన్నట్టు స్టేజ్ మీద ఉన్న పెళ్లి కూతుర్ని పలకరించా... కుశల ప్రశ్నలు, పెదవి విరుపులు, నిట్టూర్పులు, దొంగ చూపులు, క్షమాపణలు, అన్నీ అప్పగింతలోతో  పాటు అయిపోయాయి; తన చూపుతో పిలిచిన చూపుకి దగ్గరికి వేళ్ళాను, పక్కన వాళ్ళ అమ్మగారు మానవరాలిని ఆడిస్తోంది! ;
వచ్చి ఎంతసేపైందిఅండి? బావున్నారా,?.... అవును మీ అమ్మ నాన్న వస్తున్నట్టు చెప్పనే లేదు...  
ఏం వచ్చారని చెబితే కానీ తొందరగా రారా? అవునులే నీకు నా కన్నా నా బిడ్డ కన్నా ఊళ్ళో పనులే కదా ముఖ్యం!
అమ్మ దీనమ్మ ఏమి ఇరికించవే, ఆవిడ ముందు బానే బుక్ చేశావ్ గా అనుకున్నానో లేదో...
ఫీల్ అవ్వకూ ఏదో జోక్ చేశా... నీ గురుంచి నాకు తెలియదా అంటూ ఓ ఓదార్పు...  ప్రేమగా గిల్లుతూ  కార్ కీస్ చేతిలో పెట్టింది, అవును నీ బైక్ OK కదా, లేక పోతే నాన్నని వెనక ఇంటికి తీస్కురమ్మని చెప్పనా ? వధ్ధు లే రాత్రి పెద్దాయన్ని ఇబ్బంది ఎందుకు పెట్టడం, నేను చూస్కుంట కానీ అయ్యని కూడా రమ్మను... నాన్న కార్ దగ్గరే ఉన్నారు, కొత్త కార్ అని తెగ కాపలా కాస్తున్నాడు దానికి;
కాపలానా? పాడ? మంచి పాన్ వేసుకొని... సిగరెట్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన! కొత్త మామగారు అందరినీ అక్కడ ఒకే సారి చూసే సరికి కంగుతిన్నాడు.
అందరం కూర్చున్నాం; కొత్తకారు smooth గా వెళ్లిపోతోంది, అప్పటికే 11 అయి పోతోంది, పెద్ద ట్రాఫిక్ లేదు స్పీడ్ గానే నడుపుతున్నా.. అప్పుడు చూసా పక్కన తనని; ఒళ్ళో చిట్టి తల్లి నిద్రపోతోంది, ఇవ్వాళ ఎందుకో కొత్తగా అనిపించింది.. తను బావుంది, 'అమ్మతనం వలన ఒక నిండుతనం' తనలో ఇప్పుడు; నన్ను చూస్తూ ఏంటి అన్నట్టు కనుసైగ చేసింది... “ఎలా ఉన్నావ్ బాబు, బాగా బిజీ అయిపోయావ్ అంట కదా, అందుకేనేమో ఈ మద్య మాకు కూడా ఫోన్లు చేయడం లేదు... అంటూ వీళ్ళ నాన్న “పాత్రకి” న్యాయం చేయాలని డైలాగ్ అందుకున్నాడు”       
 అదెమి లెదండి, జితాలు సరిగా ఇవ్వటం లెదని కంపెనీ మారాను! కొత్త కదా తాట తీస్తూన్నారు అంతె. కోటి దాటం;    ట్రాఫిక్ కూడా లేదు స్పీడ్ పెఁచా, మియాపూర్ కి ఏప్పటికి చెరుకుంటనొ ఎఁటో.... మెల్లగా చినికులు మొదలైనాయి, విండొస్ తీసి రెడియో ఆన్ చెసా... మంచి పాట, రొడ్డు మీదకి తల ఎత్తి రొడ్డు మీదకి చూస్తె; ఆటొ ఎదవ అడ్డంగా తిప్పెస్తున్నాడు, కంగారులొ గట్టిగా బ్రెక్ వేసా, కొత్త బండి గ్రిప్ లాట్టక్ మని ఆగి పొయి, కొద్దిగ స్కిడ్ అయ్యింది! ఆ కుదుపుకి అందరు ఒక్కసారి ఉల్లిక్కి పడ్డారు! ఎవ్వరు ఏమీ మాట్లాడ లెదు, సారీ కొత్త కారు కదా, తనతొ  "నా కారు కి తోక్కినట్టు గట్ట్గాగా వెసా", పర్లెదులె అలవాటు కావడాలనికి టైం పదుతుంది అంటూ, పాప ని వాళ్ళ అమ్మగారికి ఇచ్చెసిఁది......
అమీర్ పెట్, ప్రైవేట్ బస్సుల టైం! 4 ఇయర్స్ బ్యాక్ ఇక్కడె తను పెట్టా పెడా సర్దుకొని నన్ను నమ్ముకొని ఇంట్లొ నుంచి వచ్చెయటం గుర్తొచింది, ఆ రొజు ఇంకా మర్చి పొలెను, ఎక్కడొ క్రికెట్ చూస్తు ఉన్నా... ఉన్న పళంగా రమ్మని ఫొన్, ఒకటె ఎడుస్తొంది.... అప్పుడు అన్నయ్య బైక్ వాడుతున్నా...ఆ డొక్కూ బండి అంత స్పీడ్ వెలుతుంతదని... దానికి బ్రెక్స్ కూడా పడవని తెలీదు... అసలు దారిలో వాడితెగా.... ఉప్పల్ నుంచి అమీర్ పేట్, 16ని; రావొచ్చు అని అప్పుడె తెలిసింది,
ఒక పెద్ద బాగ్ తొ మెడం గారు దిక్కులు చూస్తొంది.. చుట్టూ ప్రయాణికులు, ... “ నెను అక్కడ ఉండను, వాళ్ళ గొడవల మద్య ఆ కొంపలొ ఉండను.. నన్ను ఎక్కడికైన తిస్కెళ్ళి పొ,  అమ్మ నాన్న ఎవ్వరు నన్నుఅర్ధం చెస్కొవట్లెదు... నాకు ఉన్నది నువ్వె... నన్ను తిస్కెళ్ళీ పో.... డెసైడ్ అయి చెప్పెసింది...” నువ్వు చెసిన నంబర్ ఎవరిది... కాల్ చెస్తుంటె లిఫ్ట్ చెయడం లేదు... ఇక్కడికి వచ్చాక ట్రై చెస్తె రింగ్ అవుతొంది..? నీ నంబర్ పని చెయడం లెదు?.... అది 1 కాయిన్ బాక్స్... నా ఫొన్ ఇంట్లోనె విసిరెసి వచ్చా.... తనది దైర్యమో, బలుపొ, అమయకత్వ మో  అర్ధం కాలెదు... ఒక వెళ నెను రాకపొతె! నాఫొన్ కలవకపొతె.... నాకు ఎం చెయ్యలొ అర్ధం కాలెదు... నెనె ఆకలి రాజ్యం లొ... అన్నయ్య ఇంటికి మారాను... (ఆ విషయం తనకి తెలుసు)... ఇప్పుడు ఎక్కడికి తిసుకెళ్ళను నిన్ను.... ???
రేపూ బూమ్మిద ఉంటానొ లెదొ నాకె తెలీదు, ముందు ఆకలెస్తొంది.... టాఁక్ బండ్ మీద ఐస్ క్రీం తిందామంది... సికంద్రబాద్ స్టెషన్ లొ దొస తిని, తరువాత ఐస్ క్రీం తిని రొడ్ల మీద తిప్పుతున్నా... నాంపల్లి స్టెషన్ లొ సిగెరట్ వెలిగించా...అప్పుడు వెలిగింది నా దగ్గరా డబ్బులు అయిపొయాయని... మొహమాటం లెకుండా అడిగా.. ఇంట్లొనుంచి డబ్బులుఎంత తెచ్చవ్ అని....ఓ 2000 క్యాష్, నగలు తెచ్చుకున్నా అంది.... మొదటి సారిగా కడుపులో భయమంటె తెలిసింది... ఇంత రాత్రి, అమ్మాయితో, నగలతొ రొడ్ల మీద ఎం చెస్తున్నా అని, పొలీసులు అడిగితె! ఈ పిల్లకి ఎమ్మన్నా అయితె!, జనం ఉన్న చొట తిరగటం మంచిదె అయ్యింది... మమ్మల్ని చూసి ఎవరైన రైలు దిగి వస్తున్నారు అనుకుంటారు....
లాడ్జ్ లొ రూం తిస్కుందాం అని ఫిక్స్ అయ్యాం... పక్కనె లక్డికపూల్ లొ ఒక లాడ్జ్ కి వెళ్ళాం, మనం భయపడతం కాని ఎవ్వరు ఎమి అడగరు.. ఒక్క అడ్డర్స్ ప్రూఫ్ అడిగాడు.. ఎదొ నా లైసెన్స్ ఇచ్చా... నొట్ చెస్కున్నాడు... అంతె... రూం లొకి వెల్లిపోయాం... ఆ లైసెన్స్ మీద ఉంది ఎప్పుడొ నెను డిగ్రీ చెసినప్పటి ఊరి చిరునామా... ఇప్పుడు మనం ఆ వూళ్ళోనే లేము... హ్యపి... నెనం చెస్తున్నానొ ఒక్క సారి అలొచించా.... క్లియ్యర్ గా చెప్పా... నెను నిన్ను అప్పుడె పెళ్ళీ చెసుకొను... మా ఇంట్లొ  ఓప్పించాలి, ఇలా దొఁగ పెళ్ళి ఇష్టం లేదు అని...మాటల యుధ్ధం మొదలైంది, ప్రశ్నలు సమాధనాలు..... నగలు మహ అయితె 2 నెలలు ఆదుకుంటాయి... నాకు ఉద్యొగం రాక పొతె! ఇళ్ళలొ తగదాలు కెసులు, పరువులు,  నా డ్రీం.... ఇప్పుడు ఈ పెళ్ళీ చెస్కొని  సాధించాలి, ఒక్క నచ్చిన అమ్మాయిని చెసుకున్నాం అన్న త్రుప్తి తప్ప!.... రెపటి రొజు నా వల్ల ప్రాబ్లం వస్తె ఇది ఎక్కడికి వెల్తుంది! ఎవరితొ చెప్పుకుంటుంది... పిల్లలని ఎలా చూస్కొవాలి! శెలవలకి ఎవరి ఇఁటికి పంపాలి? ఈ ప్రశ్నలకి జవాబు లెదు ఇధ్దరి దగ్గర... దీనమ్మా అలొచనలకి.. నా వయసు ఇంకొ 15 పెరిగింది... కుదరదని అర్ధమైపొయింది.... చిరాకులో సిగరట్ కొసం కిందకి వచ్చా... మాములుగా అయితె నాలంటి వాడు దొరికన చాన్స్ ని వినియొగించుకొవాలి....”ఈ రాత్రి తో సహా!”, నెనెమిటీ వెర్రిపప్ప లాగా నీతులు చెప్తున్నా....  నా చెతకానితనాన్ని, మంచితనం అన్న ముసుగులో కప్పుతున్నావ్ అంటూ నాలో ఉన్న “మగాడు” ఉసిగొల్పుతున్నాడు... నాకు భయం ఉందని అర్ధమైంది! పెళ్ళంటె,…… అది కలిసి ఉండటం కాదు, భాద్యతగా ఉండలేనప్పూడూ ఏ పని చెయ్యకూడదు కదా! మనం ఎప్పుడు సగం పనులు దొంగ పనులు చెయ్యలెదు కదా... ఇలా నన్ను నేను పొగుడుకుంటూ, సమర్ధించుకుంటూ .... ఇన్ని రకాలుగా అలొచింప చెసినా తల్లి పెంపకాన్ని గుర్తుచెసుకొని... మళ్ళి ఇంటీ గురించి అలొచిస్తుంటె, ఫొన్ పైనె వదిలెసావ్ ఎవరొ “New Aunty” రెండు సార్లు చెసింది .. అని మెడంగారు కిందకి  నా ఫొన్ తొ వచ్చింది. కంగారుగా లిఫ్ట్ చెసావా? అని అడిగాను... “New Aunty” అంటె ఎవరొ కాదు! వాళ్ళ అమ్మగారు, ఒకసంవత్సరం క్రితం నుంచి అవిడ కూడ బాగా తెలుసు, ఎంతలా అంటె వాళ్ళ ఇంటి సమానులు మా ఇంటి సామాన్లా మొసెంత..... నా కన్నా మా అమ్మె మంచి ఫ్రెండ్ నీకు అని చాలా సార్లు యెడిపించెది తను, మరి ఈవిడగారు, అవిడ చెప్పిన మాట వినక పొతె... నువైనా చెప్పు అని నాకె కాల్ చెసెది ఆంటి…. మాట్లాడాను దైర్యం చెప్పా... ఆవిడ ఏడుపు... మొత్తానికి పొధ్దున 4గం. ఇంట్లొ దిగబెట్ట!
నీతులు నెను చెప్పగలను అని అప్పుడె తెలిసింది, సకుటుంబంగా సపరి వార సమెతంగా తిట్టెసి, ఘన కార్యం చెసినట్టు బయట పడ్డా... cut చేస్తె ఒక 6 నెలల తరువాత షరా మాములె! మొత్తనికి నన్నె చెసుకుంటానని తెగెసి చెప్పిందట, సినిమాల్లొ పని చెసె వాడికి నా బిడ్డను ఇయ్యను, అని ఆవిడా తెగెసిందని ఫొన్ ల ద్వారా తెలిసింది, అమ్మ చెప్పిన పెళ్ళి సంబంధాలన్ని, కఫె డె లొ నెను చూస్తు...ఫైనల్ గా “తనకి” ఒక్కడిని సెలెక్ట్ చేసా.... వీళ్ళ పెళ్ళికి వెళ్ళాను,  మా గురుంచి తెలిసిన వాళ్ళూ , నన్ను ఓదార్చటం మొదలు పెట్టరు, అక్కడ తప్పించింకుంటె ఫెస్ బూక్ లొ నెలలు నిండాయి అన్న వార్త నుంచి, 6 నెలలకి అన్నప్రాసన అయ్యె దాక అప్ డెట్స్ వస్తునె ఉన్నై, హైదరబాద్ వచ్చినప్పుడు ఒక 2 సార్లు కలిసా, 10 సార్లు పిలిస్తే....
కొన్నాళ్ళ తరువాత, కార్ కొన్నారు మా అయన, రిజిస్ట్రెషన్ అయ్యక తీసుకెళతాం... వచ్చి చూడమంటె, నా సెకండ్ హాండ్ కారుని వెలెత్తిచూపింది అనుకొని లైట్ తీసుకున్నా.... తరువాత అర్ధమైంది, “సార్” గారు ఊరెళూతుంటె అదేరోజు ఈ “పెళ్ళీ” కి వీళ్ళు రావలని, వీళ్ళూ ఒచ్చారు అయనతొ, అయన వెళ్ళాడు
 కార్ ని, వీళ్ళని వదలటానికి ఓ నమ్మకస్తుడు కావాలి, ఇది సహయమా? అవసరానికి వాడుకునె స్వార్ధమా?నిజంగానె  చూడలన్న తపన?, లెక నెను చూడు ఎలా ఉన్ననో అన్న బలుపా? లెదా ఫ్లాష్ బాక్ లొ చెప్పినట్టు, “మన” ఫ్యామిలి ట్రిప్  ట్రైలరా?..... నా అలొచనలతొ పాటె కార్ కూడ “యు” టర్న్ తీసుకొని వాళ్ళ ఇంటి ముందు ఆపాను. పాపని తీసుకొని న్యూ ఆంటి ముందె దిగిపొయింది. తాళం తీసె నెపం తొ, అంకుల్(మామగారు) అవిడకన్నా ముందె గెట్ దగ్గరికి వెళ్ళీ పొయాడు,
          సామన్లు తీస్కుంటు తను లొపలె ఉంది.. సారి రా.. ఇబ్బంది పెడుతున్నా అంది... పర్లెదు... సగం మునిగిన వాడికి చలి ఎమిటి? (4 యెళ్ళుగా చెస్తొందెగా)..... ఈ మధ్య కలవటం లేదు( కావాలనె) బిసి అయ్యా, అంతె... ఇంక ఎదొ చెప్పాలని అనుకులె లొపె... “కారు జగ్రత్త్తగా గొడ పక్కన పెట్టి వెళ్ళు” అని కిటికి లో నుంచి ఆంటి చెప్పి వెళ్ళిపొయింది... ఎదొ డ్రైవర్ ఆర్డర్ వెసినట్టూ అనిపించింది.... నా మొహం చూసి తను దగ్గరికి వచ్చి ఒక చిన్న హగ్(లాఁటిది) ఇచ్చి... జగ్రత్తగా వెళ్ళు అంటు చొరవగా ఒక 500/- పైన జెబు లొ పేట్టింది... ఎంట్రా ఇది అనెలొపలె... ఆటొకివెళ్ళు అంటూ...ఇంట్లొకి వెళ్ళిపొయింది.... నవ్వాలొ, ఎడవాలొ, సిగ్గుపడాలొ... అర్ధం కాలెదు...
ఇప్పుడు... ఈ ”కాగితాన్ని” తన గుర్తుగా దాచుకున్న వస్తువులతొ చెర్చాలా!, లెక పొతె తరువాత కలినప్పుడు తిట్టి ఇచ్చెయాలా!.... అడుగులు చింతల్ రొడ్డు వైపు పడుతున్నై.... అలొచనలు మద్య మద్యలొనె ఆగిపొతున్నయి... డిసైడ్ అయిపొయా... నా కొత్త ఆఫిస్... చూడదానికి రమ్మని చెప్పి ... పక్కనె ఉన్న “పారడైస్” లొ బిర్యాని తినిపిస్తె చెల్లుకి చెల్లు....                                                     
                                                                                                    ------ B.రామ్ 

5 comments: