Sunday, November 12, 2017

అటక పాన్పు A short story by #amarbabu

 రామారావు అటక మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఏం కింద జాగా లేదా అని మీరు అడగచ్చు...కాని రామారావు మంచి తనం వాడ్ని అటక ఎక్కించింది. కింద అంతా చెడిపోయింది అని వాడి లాంటి మంచోళ్ళు ఇక్కడ ఉండకూడదు అని అటక ఎక్కించారు. రామారావు నవ్వుతూ అటక మీద నుంచి గర్వంగా తన మంచితనం ఉట్టి పడేలా కింద ఉన్న చెడ్డ ప్రపంచాని కి చెయ్యి ఊపుతున్నాడు. చెడు ప్రపంచం కళ్ళల్లో ఆనంద బాష్పాలు .. రామారావు లాంటి మంచి వాడిని తనలో మమేకం చేసుకోనందుకు. తమ లో ఒకడు కానందుకు. రామారావు నవ్వు యెనక అత్యంత కష్టంగా అత్యంత బరువైన, భారమయిన "మంచితనాన్ని" మోస్తున్న గతం ఉందని తెలిస్తే ఒక్క క్షణం ఆలోచించకుండా అతన్ని అటక మీద నుంచి యిట్టె కింద కు దింపేస్తాం రామారావు పుట్టగానే, వాడి మొహం లో అమాయకత్వం చూసి నానమ్మ తాతయ్య , భలే మంచివాడు పుట్టాడు ర అబ్బాయ్ అని కొడుకు తో అని .. మంచితనాని కి మారు పేరు అయిన రాముడు పేరు పెడదామని తాతయ్య అంటే రాముడు పేరు కొంచం మొరటుగా గరుగ్గా ఉందని రామారావు అని నామకరణం చేసింది నానమ్మ. రామ రావు ఎదుగుతున్న కొద్ది ఇక నానమ్మ తాతయ్య వాడి మంచితనం గురించి చాటింపు వెయ్యడమే ధ్యేయంగా పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు . రామారావు కి ఐదు ఏళ్ళు అప్పుడనుకుంట నానమ్మ వాడిని వెంట పెట్టుకొని పక్కింటి సూరమ్మ గారి ఇంటికి వెళ్ళింది. సూరమ్మ, రామారావు ని చూసి "ఎంత అమాయకంగా ఉన్నాడు అమ్మ పిల్లోడు, ఇట్టే ముద్దోచ్చేస్తున్నాడు, ఉండు తినడానికి ఏమన్నా తెస్తాను " అని చెప్పి లోపలి వెళ్లి లడ్డ్లు , జంతికలు వగైరా చిరుతిళ్ళ తో పాటు ఆపిల్ పండు కూడా తెచ్చి పెట్టింది. రామారావు నోరు ఊరిపోతుంది .. తదేకంగా లడ్డూ జంతికల వైపు చూస్తున్నాడు.. గబుక్కున లడ్డు అందుకొనే లోపు, నానమ్మ సూరమ్మ తో " మా రామ రావు ఎంత మంచివాడం టే ..చిరుతిళ్ళు అస్సలు తినడు, వాడి కి ఆపిల్స్ అంటె చాల ఇష్టం " అని అనేసరికి, రామారావు చెయ్యి లటుక్కున 30 డిగ్రీ లు లెఫ్ట్ కి తరిగి ఆపిల్ ని అందుకుంది. నానమ్మ మొహం లో ఆనందం గర్వం ముందు నోరు తడి ఆరిపోయింది.. పక్కనుంచి సూరమ్మ " నిజమే సుమండీ" అని దగ్గరికి తీసుకొని గట్టి గ ముద్దు పెట్టి " ఈ వయసులో ఎంత మంది పిల్లలకి ఇంత మంచితనం ఉంటుంది" అని అనేసరికి రామారావు తను చేసిన త్యాగని కి మంచి గుర్తింపే వచ్చింది అని అనుకున్నాడు. ఇలా త్యాగాలు చెయ్యాల్సిన అవసరం రోజు రోజు కి పెరిగిపోతుండడం తో కాసింత బాధ ఉన్న మొదట్లో మంచోడు అనే ముద్ర వినడాని కి చాల బాగా అనిపించేది . ఇక స్కూల్ లో రామా రావు అంటే మంచి తనానికి మారు పేరు.. . క్లాసు లీడర్ .. టీచర్స్ అందరు పిల్ల లకి రామ రావు ని చూసి నేర్చుకోండి అని పదే..పదే అనడం .. క్లాసు లో అందరు రామారావు ని అటక మీద ఉంచి చూసేవాళ్ళు .. 7th క్లాసు లో ఉన్నప్పుడు ఫ్రండ్స్ కొంత మంది క్లాసు ఎగ్గొట్టి సినిమా కి వెళ్దామని సీక్రెట్ గ ప్లాన్ చేసుకుంటున్నారు .. రామారావు పక్క నుంచి విని పిచ్చ exciting గ ఫీల్ అయ్యాడు .. చెడిపోవడాని కి ఇదే మంచి అవకాసం అనుకున్నాడు .. ఎలాగన్నా చేడి పోవాలి అని గట్టి నిర్ణయం తీసుకొని ఫ్రండ్స్ ని కలుద్దామని అనుకోనే లోపు ఒకడు " ఒరేయ్ ఈ విషయం రామారావు గాడి కి తెలియ నివ్వకండి, వాడు క్లాసు లో అందరికి చెప్పేస్తాడు, వాడి మంచితనం గురించి తెలుసు గ " అని అనేసరికి రామారావు గుండెకాయ నిక్కరులోకి వచ్చింది .. "నేను ఎవ్వరికీ చెప్పను, నేను కూడా మీతో వస్తాను" అని గట్టి గ అరిచి చెప్పాలని అనిపించినా....ఫ్రెండ్స్ కి తన మంచితనం మీద ఉన్న నమ్మకం తో ఏమి అనలేక అలా ఉండి పోయాడు. అల్లరి చెయ్యాలని .. గొడవలు పడాలని .. పిచ్చి పిచ్చి గ రోడ్ మీద డాన్సు వెయ్యలని...వర్షం లో తడిసి ముద్దా అవ్వాలని ..టీచర్ కి భయపడకుండా సమాధానం చెప్పాలని .. బూతులు మాట్లాడాలని ఎన్నో కొరికలు.. కాని ఎక్కడి కి వెళ్ళిన ఈ మంచితనం అడ్డొస్తుంది ... పోనీ ఇంట్లో చెల్లి తో కొట్లాడ దామన్న, అమ్మ" అన్నయ చూడు ఎంత మంచి గ ఉంటాడో .. నీలా అల్లరి చేస్తాడా " అని.. గ్రౌండ్ లో క్రికెట్ ఆడదామనుకుంటే పక్కింటి నుంచి " రామారావు ని చూసి సిగ్గు తెచ్చుకోండి మీలా క్రికెట్ అనకుండా, ఇంటి పట్టున ఉంది చదువుకుంటున్నాడు కాబట్టీ క్లాసు ఫ్రిస్ట్ వస్తున్నాడు " అని... ఎటు చూసిన మంచితనాన్ని పొగుడుతుంటే అటు నచ్చిన పని చెయ్యలేక మంచితనం భారం మొయ్యలేక సతమతం అవుతున్న రామారావు కి 10th క్లాసు లో జరిగిన రెండు సంఘటనలు అత్యంత బాధ ని మిగిల్చాయి . తన ఫ్రండ్స్ అందరు లాస్ట్ బెంచ్ లో కూర్చొని బూతు బొమ్మలు చూస్తుంటే తన మంచితనం వల్ల మొదటి బెంచ్ లో కూర్చోవలసి వచ్చి వాటిని చూడలేకపోవడం.. "నాకు చూడాలని ఉంది ....నాకు చూపించండి " అని అడగడాని కి మంచితనం అడ్డు రావడం.. క్లాసు లో ఉన్న అమ్మాయిలు అందరు తన మగతనాన్ని చూడకుండా కేవలం మంచితనం చూసి అందరు రామ రావు ని అన్న లా భావించి రాఖి లు కట్టడం.. తట్టుకోలేకపోయాడు .. ఇంకా చాలు అనుకున్నాడు .. ఈ ఒక్క సంవత్సరం తో స్కూల్ అయిపోతుంది దాని తో పాటు న మంచి తనాన్ని కూడా చంపేస్తాను.. నేను అంటే ఎవ్వరి కి తెలియని కాలేజీ లో జాయిన్ అవుతాను, నాకు నచ్చినట్టు ఉంటాను " అని గట్టి గ నిర్ణయించుకున్నాడు.. 10th క్లాసు పరిక్షలు అయ్యాయి .. రామారావు తను ఎలా ఉండాలో లెక్క లేసుకున్తున్నాడు .. ఫస్ట్ హెయిర్ కట్ మార్చాలి .. మొహం మరీ అమాయకంగా ఉంది కాబట్టి ఒకటో రెండో గాట్లు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని మొరటు ఆలోచన .. మొహం నున్నగా ఉంది .. నాన్న షేవింగ్ రేజర్ తో ఒక సారి గీసి పారేస్తే మొహం కొంచం రఫ్ గ తయారవుతుంది కదా అని పైత్యపు ఆలోచన.. ఇక ఓన్లీ జీన్ pants ..t -షర్ట్స్ మాత్రమె వేసుకుందామని డిసైడ్ అవుతాడు .. ఇంట్లో తలుపులు బిగించుకొని మైఖేల్ జాక్సన్ పాటలు పాడుతూ డాన్సు లు చెయ్యదమ్.. అమ్మాయిల్ని ఎలా మెప్పించాల అని రక రకాలు గ అలోచించి అద్దం ముందు ప్రాక్టీసు చెయ్యదమ్. మంచితనం వల్ల తను ఎంత కోల్పోయాడు గుర్తుతెచ్చుకొని నానమ్మ్ ని తాతయ్యని తిట్టుకోవడం .. చెవులకు రింగ్స్ పెట్టుకుంటే అబ్బాయి లు చాల trendy గ ఉంటారని తెలుసుకొని ..కాలేజీ లో జాయిన్ అయ్య్పాటికి చెవులు కుట్టించి కోవాలని డైరీ లో రాసుకుంటాడు ..అస్సలు తన రూం ఇంత నీట్ గ ఉండకూడదని .. రూం అంత చిందర వందర చేసి ఎన్నో కలలు మరెన్నో ఊహలతో ... రేపటి నుంచి తనలో మంచితనాని కి ఇక సెలవు ప్రకటించి .. తనలో ఎప్పటి నించో దాగున్న చెడ్డతనాన్ని బయటకి లాగి ఉర్రూతలూగించాలని ద్రుడనిస్చయం తీసుకున్న రామారావు నిద్రలోకి జారుకున్నాడు **************************** నానమ్మ ..తాతయ్య .. నాన్న... అమ్మ .. చెల్లి ... అదే పని గ. దబా ..దబా తలుపు కొడుతున్నారు .. ఎన్ని సార్లు తలుపు కొట్టిన నో రెస్పాన్స్ .. రూం అంతా గందరగోలంగా చిందర వందరగా ఉంది .. మత్తు గ మూలుగుతున్న రామారావు తలుపు కొడుతున్నట్టు అనిప్పించి మెల్లి గ బెడ్ మీద నుంచి లేసి .. అద్దం ముందు నిల్చొని .. ఈ రోజు నుంచి మంచి తనానికి గుడ్ బాయ్ అని అనుకోని తలుపు దగ్గరికి వెళ్లి ఓపెన్ చేస్తాడు .. నానమ్మ ..తాతయ్య .. నాన్న... అమ్మ .. చెల్లి..ఒక్క ఉదుటన రామారావు మీద పడి ..బయట కి లాగి గట్టి గ కౌగలించుకొని .నాన్నమ్మ ముద్దులు పెట్టేస్తూ..తాతయ్య భుజం తట్టేస్తూ .. అమ్మ నుదుటి మీద ముద్దు పెట్టేస్తూ .. నాన్న వెనకి నుంచి పైకి లేపెస్తూ .. చెల్లి కాళ్ళ కి అడ్డం పడుతూ అస్సలు ఎం జరుగుతుంది.. ఎందుకు ఈ హడావుడి అంతా అని అనుకోనేలోపు ... అన్ని తెలుగు ఇంగ్లీష్ చానల్స్ మీడియా ఇంటి ముందు కాపు గాయడం చూసి రామారావు కి ఎం జరుగుతుందో అర్ధం కాలేదు .. ఇంతలో నానమ్మ ..."నువ్వు 10 క్లాసు లో స్టేట్ ఫస్ట్ వచ్చావు రా "అని చెప్పడం తో పాటు .. మీడియా ని రామారావు మీద కి ఉసుగొల్పుతున్ది.. ఈ రోజు తో మంచి తనాన్ని చంపేసి చెడు ని పెంచి పోషించాలనుకున్న రామారావు ఆశలు తలకిన్దులయ్యాయి.... ఒక విలేకరి , " మీరు స్టేట్ ఫస్ట్ వచ్చారు కదా , మీకేమనిపిస్తుంది ?" నానమ్మ అందుకొని , " వాడు ఇప్పుడేంటి, ఎప్పుడూ ఫస్ట్ ఏ, వాడు పుట్టగానే వాడి గొప్పథనమ్... మంచితనమ్.. పెద్దలంటే గౌరవం .. వాడి మొహం మీద ఉట్టి పడ్డాయి అందుకే ఆ శ్రీరాముడి పేరు పెట్టాము" అని ఎంతో గర్వంగా .. పట్టరాని ఆనందం తో గల గలా మాట్లాడేస్తుంది. రామారావు , అన్నిటి కి సిగ్గు నటిస్తూ అలా తన కళ్ళ ముందు తన లో ఉన్న చేడుతనం హత్య జరుగుతున్న ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితి లో ఉన్నాడు. ఇంగ్లీష్ ఛానల్ విలేకరి " So, how many hours did you study every day to get this first rank" అని అడగడం తో రామారావు తండ్రి " I think I should answer this question, more than hours I think his attitude towards life made him to achieve this. He always preferred to study than to go out and play with friends..He never liked to go out and waste his time with friends. He is very disciplined అండ్ studious and never even think about doing anything wrong. I think all the boys of this generation should take him as a role model" అని పిచ్చాపాటి ఇంగ్లీష్ లో వాయించేసాడు.. ఇంకో విలేకరి " ఇంత క్రమశిక్షణ అండ్ మంచితనం ఉన్న మీరు కచ్చితంగా మంచి డైట్ కూడా maintain చేస్తుంటారు, కొంచం అదేంటో చెప్తారా ?" తాతయ్య అందుకొని, " ఈ రోజుల్లో పిల్లలు ఎలాంటి జంక్ ఫుడ్ తింటున్నారో మీకు తెలియనిది కాదు, మీరు చెప్తే నమ్మకపోవచ్చు .. ప్లేట్ నిండా జంక్ ఫుడ్ పెట్టినా , పక్కన ఉన్న ఆపిల్ తింటాడు గాని వాటి జోలికి కూడా వెళ్ళాడు" అని చెప్పేసరికి రామారావు కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది .మళ్ళీ ఇంకో ప్రశ్న , " పిల్లలు ఎంత చదివి నా ఎంత disciplined అయిన అల్లరి చెయ్యకుండా ఉండరు , సో మీరు బాగా అల్లరి చేస్తారా ?" ఈ సారి అమ్మ అందుకుంది " మా అబ్బాయి స్కూల్ కి ఒక్కసారి కూడా మేము వెళ్ళలేదు అంటే ఆలోచించండి .. ప్రతీ ఇయర్ వాడే బెస్ట్ స్టూడెంట్ అఫ్ ది ఇయర్. ఎలాంటి అల్లరి చిల్లరి పనులు చెయ్యని మంచివాడు మా రామారావు అని మురిసిపోతూ చెప్తుంది .. లాస్ట్ ప్రశ్న .. నిజంగా ఇంత మంచి స్టూడెంట్ ని మేము ఇంత వరకు చూడలేదు .. ఇలాంటి మీరు మీ రూం ని ఎంత పద్ధతి గ పెట్టుకుంటారో చూడాలని ఉంది ... ఒక సారి చూపిస్తార ??" నానమ్మ , " దానిదేమి భాగ్యం ,రండి రండి మావాడు రూం ఎంత చక్క గ పెట్టుకున్తాడో చూపిస్తాను " అని మీడియా వాళ్ళని రూం వైపు తీసుకేల్తుంటుంది ..ఇన్థలొ చాల కోపంగా రామ రావు " ఆగండి" అని పెద్ద గ అరుస్తాడు ..రూం వైపు వేల్తున్నవాళ్ళు అందరు ఒక్కసారి గ ఆశ్చర్య పోతారు ..ఫ్యామిలీ మొత్తం షాక్ కి గురవుతారు.... రామారావు సీరియస్ గ నడుచుకుంటూ నానమ్మ దగ్గరి కి వెళ్లి .. " చాల పెద్ద తప్పు చేసావు నానమ్మ" అని అంటాడు. మీడియా , ప్రెస్ ,ఫ్యామిలీ అంతా అలా సీరియస్ గ చూస్తుంటారు .. " న ఇష్టదైవం అయిన శ్రీరాముడి కి ముందు ఈ విషయం చెప్పకుండా ఈ హడావుడి ఏంటి నానమ్మ" అని అనేసరికి నానమ్మ కల్లల్లోనుంచి నీళ్ళు జల జలా కారుతాయి..అక్కడ ఉన్న విలేకరులు..రిపోర్టర్స్ అందరు చప్పట్లతో మారో మ్రోగిన్చేస్తారు. రామారావు అక్కడ ఉన్నవాళ్ళని న రాముడి కి చెప్పొచ్చి మిమ్మల్ని లోపలి తీస్కేల్తాను అని..గబా గబా రూం లోకి వెళ్లి గట్టి గ తలుపేసుకొని .. రూం అంత తీక్షనగా చూస్తాడు .. తను ఎలా చేడి పోవాలో రాసుకున్న డైరీ లో పేజెస్ గాలి కి తిరుగుతా ఉంటాయి ..ఇక తన గురించి ప్రపంచం అంత తెల్సిపోయింది అని... ఇక మంచివాడి గ ఉండడం తప్ప వేరే దారి లేదని కన్నీళ్లు పెట్టుకొని రాముడి ఫోటో దగ్గరి కి వెల్లి... " నువ్వు నా కన్నా గొప్ప Actor వి, లేకపోతే దేవుడువి ఎలా అవుతావు " అని మొహం తుడుచుకొని నవ్వు తూ తలుపు తీస్తాడు .. అందరు రూం లో కి వెళ్లి చూసేసరికి ..రూం అంత నీట్ గ ..ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టుంటాయి .. రాముడు ఫోటో ముందు దీపం వేలుగుతుంటది... ******************************* రామారావు నాన్న తో కలిసి కార్ లో కూర్చొని, నీట్ గ uniform వేసుకొని.. దువ్వుకొని first డే కాలేజీ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాడు .. రోడ్ మీద తన ఏజ్ వాళ్ళు చేస్తున్న అల్లరి .. బైక్ మీదః రయ్య్ రయ్య్ మని వెల్లదమ్.. జీన్స్ t - షర్ట్స్ వేసుకొని colorful గ ఎంజాయ్ చేస్తున్న అమ్మాయి లు .. అబ్బాయిలు .. కాలేజీ ఫస్ట్ డే రోజు ప్రిసిపాల్ స్టూడెంట్స్ అందరి ముందు ..రామారావు ని విపరీతంగా పోగుడుతున్నాడు ... రామారావు అలా తన ప్రమేయం లేకుండానే గాల్లో తేలుతున్నాడు .. ఇది గమనించిన రామారావు .. వద్దు..వద్దు నన్ను అటక ఎక్కించకండి ...వద్దు వద్దు నేను మీరు అనుకోనే అంత మంచోడ్ని కాదు ... నేను అటక మీద కూర్చొను .. వద్దు ప్లీజ్ ... మీకు దణ్ణం పెడతాను .. నన్ను చెడిపోనివ్వండి అని బ్రతిములాడుతుంటాడు .. ఇవేమీ వినిపించని ప్రిన్సిపాల్, స్టూడెంట్స్ రామారావు ని అటక మీద కూర్చోబెడతారు.
===Kareddula Amarbabu.


0 comments:

Post a Comment