Monday, March 5, 2018

LB శ్రీరామ్ గారు పీకిన "తెలుగు వెలుగు" క్లాస్...



  • మీరంతా తెలుగంటే రోజు మీరు మాట్లాడుకునే భాష అని, మీకున్న సబ్జెక్ట్ లలో ఒకటని,రోజుకో పీరియడ్ అని, నేలోకారి సారి రాసే పరీక్షా అనుకుంటున్నారు ! కాదు
  • తెలుగు అనేది మన సంస్కృతిని మోస్తున్న ఒక రధం. మీరందరు కలిసి ముందుకు లాగితేనే అది ఒక్క గొప్ప "రధయాత్ర" అవుతుంద,అదిమిమ్మల్నిభావితరాలకి పరిచయం చేస్తుంది .
  • నీకున్నది తెలుగు మీద ప్రేమ కాదు English నేర్చుకోలేకపోయాం అన్న కోపం!
  • నేను చెప్పేది వేరే భాషల్ని అభిమానించద్దని కాదు తెలుగు ని అవమానించోద్దని
  • వేరే భాషల్ని నేర్చుకోవద్దని కాదు, తెలుగుని ఖచ్చితంగా నేర్చుకోవాలని ..
  • ఇవ్వాళ యావత్ ప్రపంచాన్ని శాసితున్న గూగుల్ కూడా వేల భాషల్లో సమాచారాన్ని అందిస్తోంది ఒక్క english లోను స్పానిష్ లోను కాదు!ఎందుకంటే గూగుల్ కూడా తెలుసు english "అనేక భాషల్లో ఒకటి" కాని , "అనేక భాషలకు ఒక్కటే" కాదు అని .
  • ఎవరు ఎన్ని భాషల్లో మాట్లాడినా అర్ధం మాత్రం మాతృభాషలోనే వెతుకుంటారు !
  • నువ్వు ఏ భాషలో బతికినా తప్పులేదు కాని నీ భాషనూ బతికించుకోకపోవటం తప్పు   
  • మీరు తల్చుకుంటే తెలుగు నేర్చుకుంటే , దాని వయసు మీ తోటి బాల్యానికి,  మీ నూనుగు మీసాల యవ్వనానికి వస్తుంది.   
  • తప్పక చూడాల్సిన బుల్లి సినిమా ; క్రింద లింక్ లో

0 comments:

Post a Comment