Sunday, May 13, 2018

"నాకు భారతదేశం వారు దారి చూపించారు" అని వాస్కోడిగామా వ్రాసినా సరే, మనం మాత్రం మన పిల్లలకు వాస్కోడిగామా భారతదేశానికి దారి కనుకున్నాడనే చెబుతాం.

'వాస్కోడిగామానే కదా ఇండియాని కనుగొన్నది'
ఈ వ్యాస రచయిత ఇప్పటికి 24 దేశాలు పర్యటించారు. కొన్నిదేశాలు అనేక సార్లు వెళ్లారు. అనేక దేశాలలో అధ్యక్షులు, ప్రధానులు, రాజులు, రాణులను కలవడం జరిగింది. అనేకానేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు, బంగారు పతకాలు అందుకోవటం జరిగింది. ఏదేశం వెళ్లిన ముఖ్యంగా ఐరోపా ఖండం, దేశాలు వెళితే భారతదేశం అనగానే 'వాస్కోడిగామా' పేరు చెపుతారు. "వాస్కోడిగామానే కదా ఇండియాని కనుగొన్నది అని వెంటనే అంటారు".
ఈ దేశం ఎప్పుడో లక్షల సంవత్సరాలనుండి ఉన్నది, దానికి తగ్గ చరిత్ర, సంస్కృతీ ఉన్నాయి. కాలానుగుణంగా అవి మారుతూ వచ్చాయి. బ్రిటిషువాళ్ళు, దానికిముందు మొగలాయిలు పరిపాలించినా వాళ్లెప్పుడూ ఈ దేశాన్ని తమ దేశంగా భావించలేదు, మనము వాళ్ళను మనదేశపు పాలకులుగా చూడలేదు. దాని తర్వాత స్వాత్రంత్యం వచ్చినా, వచ్చిన పాలకులు అంటే జవహర్లాల్ నెహ్రు నాయకత్వాన వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము తప్పుడు చరిత్ర, బానిస భావజాలము, మన స్వాభిమానాన్ని దెబ్బతీసి కధలు, పాఠాలు బాల్యమునుండే నూరిపోశారు. దీనికి నెహ్రు హిందువు ముసుగులోఉన్న మహమ్మోదియిడు అయి మొగలాయిలను తమ పూర్వికులుగా భావిస్తూ హిందుత్వాన్ని నాశనంచేసి, మనల్ని బానిసలుగానే ఉంచాలన్న ఒక దుర్మార్గపు ఆలోచనతోనే పని చేసాడు.
కమ్యూనిస్టు చరిత్రకారులతో మన చరిత్ర వ్రాయించి, బానిస భావజాలం మాల్యంనుండే మన మెదళ్లలో జొప్పించి, మనల్ని ఒక పనికిమాలిన జాతిగా చేయటమే, నెహ్రు మరియు కాంగ్రెస్ వాళ్ళ ఉద్దేశ్యము. దీనికి లౌకికతత్వమూ అనే ఒక ముసుగు. కాంగ్రెస్ ద్వారా పదవులు, ధనం ఇంకా అనేకానేక లాభాలు పొందినవారంతా స్వాభిమానాన్నివదిలి లాభాలకే దాసోహమన్నారు. ఆ తర్వాత వచ్చిన తరంవాళ్ళు గాంధీ, నెహ్రూలు లేకపోతె దేశమేలేదు అనేస్థితికి వచ్చారు. అలా కుట్రతో నెహ్రు చేసిన అనేకానేక పనులలో తప్పుడు చరిత్ర రాయించడం, దానిని మనచేత చదివించి మనతోనే మనల్ని పనికిమాలిన వాళ్ళుగా చెప్పించడం జరిగింది. దీనికి అనేకానేక ఉదాహరణలు ఉన్నాయి.
ఈ వ్యాస రచయిత ఒకసారి 2004 లో అంతర్జాతీయ నాణ్యతా పర్యావరణ నిపుణునిగా బెల్జియం రాజధాని బ్రస్సెల్సులోని స్లోవియా ఇన్స్టిట్యూటుకి వెళ్ళినప్పుడు (ఈ ఇన్స్టిట్యూటులో ఐనుస్టెయిన్ కాక ఇంకా 5 నోబెల్ బహుమతి గ్రహీతలు డైరెక్టర్లుగా పని చేశారు) ఇదే మాట "వాస్కోడిగామానే కదా ఇండియాని కనుగొన్నది" అని ఒక శాస్త్రవేత్త అన్నారు.
దానికి సమాధానముగా "భారతదేశము అనేక లక్షల సంవత్సరాలనుండి ఉన్నది, ఉంటుంది. వాస్కోడిగామా ఎవరు మమ్మలి కనుగొనడానికి? అతను భారతదేశము పర్యటించి దానిని గురించి ఐరోపా వాసులకి చెప్పాడు, అంతే".
"నేనిప్పుడు బెల్జియం నుండి వెనక్కివెళ్లి నేనే బెల్జియంను కనుగొన్నానని ఆంటే మీరంతా ఒప్పుకుంటారా?"
అంతే వాళ్ళనోళ్లు ఒక్కసారి మూతబడ్డాయి. అందులో ఒక శాస్త్రవేత్త నేను కేరళలో చాలాకాలం ఉన్నాను. మీ పుస్తకాలలోకూడా మరి అలా ఎందుకు రాశారు అని అడిగాడు. దానికి జవహర్లాల్ నెహ్రు కారణమని చెప్పను. ఆ విషయం వాళ్లకి అర్ధం కాలేదు.

జవహర్లాల్ నెహ్రు చేసిన అనేక జాతివ్యతిరేక చర్యలలో భాగంగా ఎన్నో కధలున్నాయి. మచ్చుకు ఒకకధ చదవండి. మన చరిత్రను దిగజార్చిన ఆగ్లేయుల బాటలోనే మనల్ని జవహర్లాల్ నెహ్రు ఎలా నడిపించాడో ఏంతో దుర్మార్గంగా! అందులో 'వాస్కోడిగామానే కదా ఇండియాని కనుగొన్నది' అనేది ముఖ్యమైనది.
ప్రశ్న : భారతదేశానికీ మార్గాన్ని కనుకున్నదెవరు?
సమాధానం : వాస్కోడిగామా
ఇది నేటికీ మన బడిలో పిల్లలకు నేర్పే పాఠం.
ఆంగ్లేయులు వ్రాసిన చరిత్ర పుస్తకాలు మనం ఈనాటికీ బట్టీపడుతూ, మన పిల్లలచేతకూడా బట్టీపట్టిస్తూ ఉంటాం.
తర్వాత వచ్చిన జవహర్లాల్ నెహ్రు ఎప్పుడు మన చరిత్రను సరిగా వ్రాయించాలి అని అనుకోలేదు.
నిజాలు తెలుసుకోవడానికి ఎవరికీ తీరిక ఉండదు.
ఆపుస్తకాలలో ఉన్న వాటిని చదివామా పరిక్షలో రాశామా.
మార్కులు తెచ్చుకున్నామా ఇదీ వరస.
అసలు కథ ఇప్పుడు తెలుసు కుందాం. *వాస్కోడిగామా డైరీ* ఈమద్య బయటపడింది.
దానిలో తనే స్వయంగా వ్రాసుకున్నాడు "ఆఫ్రికాలోని జాంజిబారు తీరంలో తను స్కందుడు అనే భారతీయ గుజరాతీ వ్యాపారిని కలిశానని, ఆయన భారతదేశం వెళుతూ తనకు త్రోవ చూపించాడని, స్కందుని నావ నా నావ కంటే 7 రెట్లు పెద్దదని, తను భారతదేశంలో తన నావకంటే 12 రెట్లు పెద్దనావలు చూశానని" రాసుకున్నాడు.
మనకు పురాతనకాలం నుండి ఇతర దేశాలకు నావలమీద వ్యాపారాల కోసం ప్రయాణాలు చేయడం ఎక్కువ. సముద్రగుప్తుడి కాలంలో ఏకంగా నాణాలమీద నావ బొమ్మ చిత్రించాడు.
"నాకు భారతదేశం వారు దారి చూపించారు" అని వాస్కోడిగామా వ్రాసినా సరే,
మనం మాత్రం మన పిల్లలకు వాస్కోడిగామా.... భారతదేశానికి దారి కనుకున్నాడనే చెబుతాం. మనకు నౌకానిర్మాణ శాస్త్రం ఉంది. భారతదేశంలో నౌకానిర్మాణం చాలా పెద్ద పరిశ్రమ.
'చింత చచ్చినా పులుపుచావలేద'నేది సామెత
బ్రిటీషు వాళ్ళుపోయినా మన బానిస బుద్ది మారలేదు. మన పాలకుల ఆలోచనలు, పనులు మనల్ని బానిసబుద్ధినుండి బయటకు రానివ్వడం లేదు.
చివరగా వాస్కోడిగామా భారతదేశాన్ని కనుగొన్నాడా లేక భారతదేశానికీ మార్గాన్నికనుగొన్నాడా, ఇందులో పెద్దతేడా ఏమి లేదు. వాస్కోడిగామా భారతదేశం రాక ముందు ఐరోపా ఖండం వారికి భారతదేశం గురించి పెద్దగా తెలియదు. కనుకు వాళ్ళు వాస్కోడిగామా భారతదేశాన్నికనుగొన్నాడని చెపుతారు. -- నరసింహ మూర్తి
https://www.facebook.com/dr.nnmurthy

0 comments:

Post a Comment