Sunday, May 13, 2018

వ్యాపారస్తుడు లాభం ఎక్కువచ్చినప్పుడు ఒక్కసారన్నా రైతుకి ఎక్కువ ఇచ్చే సంధర్భాలుంటాయా?దే కౌలుదారుకి 40 బస్తాలు పండితే రైతుకి ఎక్కువిస్తాడా?

ఒక రైతు తన 5 ఎకరాల మామిడి తోట 2016 సంవత్సరం 1 లక్షకి అమ్మాడు ఉర్లో వ్యాపారుడికి.సంగం డబ్బు ముందుకట్టాడు మిగిలింది సంగం కాయ కోతప్పుడు అన్నడు .రైతు ఒకే అన్నడు .కాయబాగా కాసింది ,రేటు పలికింది.వ్యాపారుడి కి మూడు లక్షల ఆదాయం వచ్చింది .అనుకున్నట్లు మిగిలిన సంగం డబ్బు రైతుకిచ్చాడు .మొత్తం లక్ష రైతుకి ముట్టింది.రైతు హ్యాపీ.వ్యాపారీ హ్యాపీ .అదే వ్యాపారి మళ్ళీ 2017 లో అదే 5 ఎకరాల తోటను అదే రైతు దగ్గర 1 లక్ష 20 వేలకి కొన్నాడు .సంగం డబ్బు ముందు సంగం కాయకోతప్పుడు అనుకున్నారు.వ్యాపారి 60 వేలు కట్టాడు.ప్రకృతి వైపరీత్యం కాయ కాపు లెదు ,గాలిదుమ్ము నేలరాలిన పంట వ్యాపారుడి కి 1 లక్ష 50 వేలు మాత్రమే వచ్చాయి.రైతుకి సంగం కడితే వ్యాపారుడి కి మిగులులేదు .రైతుతో వ్యాపారస్తుడు మాట్లాడుకొని పంట లాస్ కాబట్టి ఒక 40 వేలు తగ్గించి ఇచాడు రైతుకి.మరి ఇదె వ్యాపారస్తుడు లాభం ఎక్కువచ్చినప్పుడు ఒక్కసారన్నా రైతుకి ఎక్కువ ఇచ్చే సంధర్భాలుంటాయా?అలాగె వరిపొలాలు కౌలుకిచ్చే రైతులు కుడా రెండు రకాలుగా కౌలుకిస్తారు.ఒకటి పెట్టబడి సెరిసగం ,పంట సెరిసగం .రెండోది పెట్టబడి మొత్తం కౌలుదారే ,పంట పది బస్తాల ధాన్యం రైతుకి అనే ఒప్పందాలుంటాయి.ఇప్పుడు ఒక ఎకరానికి 35 బస్తాల దాన్యం పండితే 10 బస్తాలు రైతుకి పోగా కౌలు దారుకి 25 బస్తాలుంటాయి, వాటిలో 10 బస్తాలు పెట్టబడి 15 బస్తాల మిగులు.అదే పంట సరిగా పండకపొతే కౌలుదారు రైతుతొ మాట్లాడుకుని పరిస్తితిని బట్టి తగ్గింపులు చేసుకుంటారు.అదే కౌలుదారుకి 40 బస్తాలు పండితే రైతుకి ఎక్కువిస్తాడా?

అది రైతుకి,కౌలు దారికి,వ్యాపారస్థుడికి ఉన్న సంబంధం.మరి వారి విషయాల గురించి మనం ఎవరం మద్యలో సలహాలివ్వడానికి ,మరియు వారి మద్య చిచ్చు పెట్టడానికి?వారి కి తెలియదా ఎలా మాట్లాడుకోవాలి.?రైతుకి ఎప్పుడూ ప్రేమే ఉంటది అని గుర్తించండి.కష్టనష్టాల గురించి ఆలోచించే వాడే రైతు .మరి నగరాలలో ఇల్లు రెంట్లు ఎవరన్నా జీతం రాలేదంటే తీసుకోటం ఆగుతారా?ఉద్యోగ రావటం లేటు అయ్యింది అప్పటివరకు సంగం రెంటు ఇస్తాం మిగిలింది ఉద్యొగం వచ్చాక ఇస్తాం అంటే ఎవరన్నా ఇంటి యజమాని ఆగేవాడు ఉన్నాడా ?మొత్తం రెంటు ఎవడన్నా చెక్ తీసుకుంటాడా?ఎక్కువ క్యాష్ బ్లాకెగా?మళ్లీ ఈ డబ్బుతొ చిట్టీలు వేసి ఇంకొ నాలుగిళ్లుకొని బ్లాక్ మార్కెట్ పెంచి భూమి రేట్లు మరియు అపార్ట్మెంట్ రేట్లు పెంచుతున్నారు.బ్యాంక్ లు కూడా నగరాలలో భూములకి కొట్లలో లోన్ ఇస్తారు మరి పల్లెలలో భూమికి వేలల్లో ఇవ్వటం కూడా కష్టంగానే ఉంది.ఇంకా 1/70 ఆక్ట్ ఉన్న ప్రాంతాల లో పరిస్తితి ఎంతో దయనీయ స్తితి.విద్య,వైద్యం ,పిల్లల పెళ్ళిళకి కుడా భూములు అమ్ముకోలేరు, బ్యాంక్ లు లోన్లు ఇవ్వవు మరి దాన్ని మాట్లాడె దమ్ము ఎవడికన్నావుందా?సమాజంలొ ఇంత దారుణమైన అసమానతల మధ్యకూడా ఎంతోకొంత మంచి మిగిలింది రైతుదగ్గరే.అలాంటి రైతుకి డబ్బులిస్తుంటే కులాలపేర,వర్గాలపేర,కౌలుపేర చిచ్చు పెడుతున్నారా. రెడ్డి,కమ్మ ,వెలమలు మాత్రమే భూస్వాములా ? మా ఊళ్లలో అన్ని కులలవారికి భూములు ఉన్నాయి...యాదవ ,గౌడ , విశ్వబ్రాహ్మణులు,మాల,మాదిగ ..ఇలా అన్ని బీసీ,st, sc కులాల వారికి భూములు ఉన్నాయి...చాలా ఊర్లలో అగ్ర కులాలు వారికంటే కూడా ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నోళ్లు ఉన్నారు.,ఆర్థిక అసమానతల గురించి మాట్లాడండి అంతేగాని మీ రాజకీయ లబ్ద్ధి కోసం కుల, మత,వర్గాల మద్య చిచ్చు పెడతారెందుకు ?రెడ్డి ,కమ్మ వెలమలలో పేదవారు చాలమంది ఉన్నారు.రిజర్వేషన్ తో జాబు సంపాదించి లంచాలు తిని నగరాలలో ఇళ్లు కట్టి అద్దెలతో సంపాదించు వారు లేరా ?అలాగని రిజర్వేషన్ ఉన్న ప్రతిఒక్కరికీ జాబు వచ్చి లంచాలు తీసుకుంటారని అర్థమా?ఇక్కడ కులాలు ,రేజర్వేషన్లు కాదు ఇంపార్టెంట్ కేవలం ఆర్థిక అసమానతల గురించి మాట్లాడితె మంచిథి.కాలం మారిందని గుర్తించండి. ఎకరాలు ఎక్కువుంటే భుస్వామి దోపిడి అని మొరిగే వాళ్ళు మరి నాగరాలలో పది ఇరవయ్యి ఇల్లు కట్టుకుని రెంట్ల పేరుతొ బ్లాక్ మనీ పోగుచేసి దారుణంగా భూమి రేట్లు పెంచి సామాన్యుడు ఇల్లుకూడా కొనలేని దుస్థితికి తెచ్చిన వారిని విమర్శించే దమ్ము ఉందా ?కౌలు చట్టం తేవడం గురించి మాట్లాడే ముందు దమ్ముంటే ఇళ్ళ కిరాయి చట్టం కుడా మాట్లాడండి.ఇప్పటికే నాగరాలకొక న్యాయం ,పల్లెలకొక న్యాయమయా?సమాజంలొ చాలా అసమానతలున్నాయి వాటిగురించి కుడా మాట్లాడండి మేదావులు.ఎంతోకొంత సంక్షేమ పథకాల పెరుతో ఈ ప్రభుత్వం ప్రజలకి వుపయోగపడే మాట వాస్తవం.100 శాతం సమన్యాయం ఈ అసమానతల సమాజంలొ సాధ్యమా?అసలు మనిషిలో 100 % న్యాయముందా?కోర్టులు 100 % న్యాయం చేస్తున్నాయా?వొందల ఎకరాలు ఒకళ్ళ పేరుమీదవుంటే ఇప్పటి వరకు 60 ఏండ్లు పాలించిన ప్రభుత్వాల కి తెలియదా?కనీసం కెసిఆర్ వచ్చి ఈ భూ రికార్డులు వెలికి తీయటంలో 80 % సక్సెస్ అయ్యడు.కొన్ని తప్పులు వెలుగులోకి వచ్చాయి .మరిప్పటివరకు మీరేం పీకినట్లో.కాకతీయ చెరువులు,భగీరథ ,కాలేశ్వరం తోనీళ్ళు ఇచ్చేది ఎవరికి?డయాలిసిస్ కేంద్రాలు ఎవరికి?జీతాల పెంపు ఎవరికి?వరి పంటని కొనుగోలుకేంద్రాల ధ్వారా కొనేది ఎవరికోసం?ఉపాథి హామీ ఎవరికి?రెషన్ ఎవరికి?డబల్ bedroom లు ఎవరికి?కరెంట్ ఎవరికి?పిక్షన్లు ఎవరికి?గురుకులాలు ఎవరికి?ప్రభుత్వ దవాఖానా ప్రక్షాలన ఎవరికి?కళ్యాణలక్ష్మి ఎవరికి?పరిశ్రమల సబ్సిడి ఏ వర్గాలకి?రిజర్వేషన్స్ ఎవరికి?అన్నపూర్ణ పథకం ఎవరికి?మీకు తెలియదా?సమాజంలొ అసమానతలు కెసిఆర్ వచ్చాక ఇప్పుడొచ్చాయా ?ఇంతకముందులేవా అసమానతలు .అన్ని వర్గాలకి ఆ సమయం వచినప్పుడు న్యాయం జరుగుద్ది.అప్పటి వరకు ఓపికఉండాలి.ఇప్పుడిపుడే మార్పు మొదలయింది.కెసిఆర్ వల్ల ఈ నాలుగేండ్లలో ఎంతోకొంత మార్పయితే మొదలైన మాట వాస్తవం.టైం పట్టుది.వేల సంవత్సరాల అసమానతలు పదుల సంవత్సరాలలో మార్చుట సాద్యమేనా?వీడి కి నచ్చింది వాడికి నచ్చదు ,వాడికి నచ్చింది వీడి కి నచ్చదు .అందుకె ఏది జరగాలన్న టైం పట్టుది.తొందరపడితే నోట్ల రద్దులాగే ఉంటది.వాడికెక్కువ లబ్ద్ధి వీడి కి తక్కువ లబ్ద్ధి అని చిచ్చు పెట్టకండి.ఒకొక్క ఊర్లో భూస్వాము లెంతమంది ఉంటారు ?నాకు తెలిసి వొకరిద్దరే.మరి మిగతావారికి లభ్ధికాదా?గుండె మీద చెయ్యివేసుకొని చెప్పండి రైతుకి పెట్టబడి ఇవ్వటం తప్పా ?ఇవ్వకివ్వక రైతుకి పెట్టుబడిస్తే ఇన్ని విమర్శలా ?రెండు లక్షల లోన్లు కౌలు రైతులకి ఇచ్చారా? ఎకరం రైతుకి 2 లక్షల లోన్ ఇచ్చారా ?మరి ఋణ మాఫీలు ఎవరికయ్యాయి?బ్యాంకుల్లో ఫ్రాడ్ చేసి ఋణమాఫీలు మిస్యూస్ చెయ్యలేదా? అందుకె కెసిఆర్ మిస్యూస్ కాకుండగా పాసుబుక్ ప్రక్షాళన చేసి పెట్టబడి పథకం పెట్టినమాట వాస్తవం.మరి ఇది ఎంత ముందుచూపు . ఈ పథకంతో పాటు గిట్టుబాటు ధరవుంటే ఇంకా మంచిథి.పెట్టబడి ఇచ్చిన ముక్యమంత్రి గిట్టుబాటు ధరకి కృషిచెయ్యడని ఎలా అనుకుంటారు?ఎంతో కొంత రైతుగురించి ఆలోచించే పథకాన్ని విమర్శించటం ఎవరికి మంచిథి?నెల జీతం పెరిగితె ఇళ్ళ రెంట్లు పెరుగుతాయి ,పంట ధర పెరిగితె కౌలు పెరుగుద్ది ,మరి బియ్యం కొనేవాడికి భారం .అమ్మేవాడికి లాభం .మరి సమానత్వం ఎలా?
సమాజంలొ సమానత్వం గురించి ఆలోచించితే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ .జుట్టు పీక్కోవాల్సిందే.అవకాశం వచినప్పుడు ఉపయోగించుకోండి అంతేగాని ముందు అవకాశం వచ్చినోడిని విమర్శించకండి.మనకీ అవకాశం వస్తది కొంచెం ఓపికుండాలంతే .
నోట్: యే వర్గాలని కానీ ,కులాలని కానీ ,మతాలని కానీ విమర్శించాలనికాదు.కేవలం సమాజంలొ అసమానతల పై నా పరిథిలో అవగాహన మాత్రమే .ఓపికగా చదివిన వారి కి ధన్యవాదములు
కుదించుట కష్టమయ్యింది.
మీ
సురేష్ బేతిని https://www.facebook.com/sureshbetini

1 comment: